వ్యాక్సినేషన్ లో మరో మైలురాయి

వ్యాక్సినేషన్ లో మరో మైలురాయి

12 ఏండ్ల నుంచి 14 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. పిల్లలకు ఇచ్చే కార్బెవ్యాక్స్ టీకాను బయోలాజికల్ సంస్థ తయారు చేసింది. కేంద్రం నుంచి 11 లక్షల డోసులు వచ్చాయని హెల్త్ డైరక్టర్ శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలో 17లక్షల 23వేల మంది అర్హులు ఉన్నారని చెప్పారు. అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో వ్యాక్సిన్ అందుబాటులో ఉందన్నారు. తల్లిదండ్రులు దగ్గరుండి పిల్లలకు వ్యాక్సిన్ వేయించాలన్నారు హెల్త్ డైరక్టర్ శ్రీనివాస్.

వేగంగా వ్యాక్సినేషన్ 

దేశవ్యాప్తంగా 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది.హైదరాబాద్ బయోలాజికల్ ఈ లిమిటెడ్ సంస్థ తయారు చేసిన కార్బోవ్యాక్స్ టీకాను ఇస్తున్నారు.  మరోవైపు రెండు కంటే ఎక్కువ వ్యాధులతో బాధపడుతూ 60 ఏళ్లు దాటిన వారికి బూస్టర్ డోసు పంపిణీ చేస్తున్నారు.2008,09,10 సంవత్సరాల్లో జన్మించిన వారు వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగస్వామ్యులు కావాలని కోరింది కేంద్రం. 12 నుంచి 14 ఏళ్ల వారు దేశవ్యాపంగా 7 కోట్ల 11 లక్షల మంది ఉన్నట్లు అంచనా వేసింది కేంద్రం. ఇప్పటికే 5 కోట్ల కార్బోవ్యాక్స్ టీకాలు కేంద్రానికి అందజేసింది బయోలాజికల్ ఈ లిమిటెడ్ సంస్థ. .