వ్యాక్సినేషన్: 18 ఏళ్లు నిండిన వారికి 28నుంచి రిజిస్ట్రేషన్

వ్యాక్సినేషన్: 18 ఏళ్లు నిండిన వారికి 28నుంచి రిజిస్ట్రేషన్

దేశంలో సెకండ్ వేవ్ లో కరోనా వ్యాప్తి కేసులు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో వైరస్ ను కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు ఫ్రంట్ లైన్ వారియర్స్ కు, 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వగా.. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ను వేయనుంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ కు అర్హులైన వారిని ఈ నెల 28 నుంచి కొవిన్ వెబ్ సైట్(cowin.gov.in) లాగిన్ అయ్యి అందులో రిజిస్ట్రేషన్ చేసుకోవలసిందిగా కేంద్రం కోరింది. ఒక్క లాగిన్‌పై నలుగురికి అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. అంతేకాదు వ్యాక్సిన్ తీసుకునే తేదీలను మార్చుకొనే వెసులుబాటు కూడా ఉంది. అలాగే ప్రస్తుతం నడుస్తోన్న టీకా దశలు కొనసాగుతాయని తెలిపింది. 

ఇప్పటికే మన దేశంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు అందుబాటులో ఉండగా.. త్వరలో రష్యా తయారీ 'స్పుత్నిక్ వి' కూడా రానుంది. వ్యాక్సినేషన్ పరిధిని పెంచిన క్రమంలో ఆయా వ్యాక్సిన్ తయారీదారులు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నారు.