అసెంబ్లీని ముట్టడించిన వడ్డెరలు..అరెస్ట్

అసెంబ్లీని ముట్టడించిన వడ్డెరలు..అరెస్ట్

హైదరాబాద్: తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ వడ్డెర కులస్తులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ఇవాల ఉదయం వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్​ చేరుకున్న వడ్డెర కుల ప్రతినిధులు విడతల వారీగా అసెంబ్లీ వైపు దూసుకొచ్చారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టు చేశారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్ తమను ఎస్టీల జాబితాలో చేర్చుతామని హామీ ఇచ్చారని, దానిని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసెంబ్లీ పరిసరాల్లోకి ఎవరూ రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. విడతల వారీగా మెరుపులా అసెంబ్లీ వైపు దూసుకొస్తుండటం గమనార్హం.