అరెరె.. పాపం వైభవ్ సూర్యవంశీ.. టీమిండియాకు సెలెక్ట్ అయిన టైంలో ఇలా జరిగిందేంటి..!

అరెరె.. పాపం వైభవ్ సూర్యవంశీ.. టీమిండియాకు సెలెక్ట్ అయిన టైంలో ఇలా జరిగిందేంటి..!

ఐపీఎల్ 2025, 2026 సీజన్లలో బౌలర్లపై సిక్సర్ల వర్షం కురిపించాడు. 2026 సీజన్లో 16 మ్యాచుల్లో 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. 15 ఏళ్లకే టీమిండియాకు సెలెక్ట్ అయి చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో చూపించిన జోష్ శ్రీలంకలో కనబడలేదు. శ్రీలంకలోని దంబుల్లాలో భారత్-ఎ, శ్రీలంక-ఎ జట్ల మధ్య జరుగుతున్న వన్డే ట్రై సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ 12 బంతుల్లో 14 పరుగులకే చేతులెత్తేశాడు.

సూపర్ ఫామ్లో ఉన్న ఈ చిచ్చరిపిడుగు నుంచి మరో అద్భుత ఇన్నింగ్స్ ఆశించిన టీమిండియా అభిమానులకు నిరాశే మిగిలింది. శ్రీలంక-ఎ టీం పేస్ బౌలర్ సిరాజ్ బౌలింగ్లో షాట్కు యత్నించి క్యాచ్గా దొరికిపోయాడు. రెండు సింగిల్స్, 3 ఫోర్లతో వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ ముగిసింది.

ఇండియా-ఎ డెబ్యూ మ్యాచ్ ఈ 15 ఏళ్ల చిచ్చుబుడ్డి ఆశలపై నీళ్లు చల్లింది. విదేశాల్లో పిచ్లపై ఆడటం ఐపీఎల్లో ఆడినంత తేలిక కాదని వైభవ్ సూర్యవంశీపై కొందరు నెటిజన్లు సెటైర్లేస్తున్నారు. టీమిండియాలోకి చోటు దక్కించుకున్న సమయంలో 14 పరుగులకే ఔట్ కావడం వైభవ్ సూర్యవంశీకి ఇబ్బందికరంగా మారింది.

ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌, ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ టూర్లతో పాటు ఆసియా క్రీడల్లో, టీమిండియాలో వైభవ్‌‌‌‌‌‌‌‌కు చోటు దక్కిన సంగతి తెలిసిందే. ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌కు ఎంపికైన అతి పిన్నవయస్కుడిగా (15 ఏళ్ల 71 రోజులు) వైభవ్‌‌‌‌‌‌‌‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఫలితంగా లెజెండరీ క్రికెటర్‌‌‌‌‌‌‌‌ సచిన్‌‌‌‌‌‌‌‌ టెండూల్కర్‌‌‌‌‌‌‌‌ (16 ఏళ్ల 205 రోజులు) పేరిటి ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లో రాజస్తాన్‌‌‌‌‌‌‌‌ రాయల్స్‌‌‌‌‌‌‌‌కు ఆడిన వైభవ్‌‌‌‌‌‌‌‌ 237.30 స్ట్రయిక్‌‌‌‌‌‌‌‌ రేట్‌‌‌‌‌‌‌‌తో 776 రన్స్‌‌‌‌‌‌‌‌ చేసి ఆరెంజ్‌‌‌‌‌‌‌‌ క్యాప్‌‌‌‌‌‌‌‌ను గెలుచుకున్నాడు. దాంతో ఈ యువ ఓపెనర్‌‌‌‌‌‌‌‌ను అటోమేటిక్‌‌‌‌‌‌‌‌గా జట్టులోకి తీసుకొచ్చారు.