IND vs ENG: కోహ్లీ జెర్సీ ధరించి హోరెత్తించిన వైభవ్.. రూల్స్ ఏం చెబుతున్నాయంటే..?

IND vs ENG: కోహ్లీ జెర్సీ ధరించి హోరెత్తించిన వైభవ్.. రూల్స్ ఏం చెబుతున్నాయంటే..?

ఐపీఎల్ లో తన సెంచరీ గాలివాటం కాదని నిరూపిస్తూ వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ తో జరిగిన అండర్- 19 మ్యాచ్ లో దుమ్ములేపాడు. కోహ్లీ జెర్సీ నెంబర్ 18 ధరించి చెలరేగి ఆడాడు. ఆడింది 18 బంతులే అయినా 48 పరుగులు చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఈ 14 ఏళ్ళ కుర్రాడి ఇన్నింగ్స్ లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. ఏ మ్యాచ్ లో వైభవ్ కోహ్లీ జెర్సీ వేసుకోవడం ఆసక్తికరంగా మారింది. కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించకుండా అతని జెర్సీ వేసుకోవచ్చా అనే విషయంపై చర్చ జరుగుతుంది. రూల్స్ ఏం చెబుతున్నాయి ఇప్పుడు చూద్దాం.. 

ఇండియా ఏ మ్యాచ్‌లలో ఏ క్రికెటర్‌కు జెర్సీ నంబర్లు నిర్ణయించబడలేదని బీసీసీఐ వివరణ ఇచ్చింది. ఇండియా ఏ జట్టు విషయానికి వస్తే ఎలాంటి జెర్సీలు ధరించాలి అనే ఖచ్చితమైన రూల్ లేదు. ఎవరైనా తమకిష్టమొచ్చిన సంఖ్యను ఎంచుకోవచ్చు. జెర్సీ నంబర్లు అంతర్జాతీయ ఆటలకు మాత్రమే పరిమితమని అని బీసీసీఐ అధికారి అన్నారు. విరాట్ కోహ్లీ ఇటీవలే టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత, అతని జెర్సీని ఎవరు వేసుకోవడానికి వీలు లేదని బీసీసీఐని నెటిజన్స్ డిమాండ్ చేశారు. కొంతమంది ఎమోషనల్ కాగా.. మరికొందరు ఆగ్రహానికి గురయ్యారు. అభిమానులకు జెర్సీ నంబర్ 18 ఒక ఎమోషన్. అది వేరే వారు ధరిస్తే జీర్ణించుకోలేరు.

అంతర్జాతీయ క్రికెట్ లో కోహ్లీ కొనసాగుతున్నంత కాలం భారత జట్టులో 18 నెంబర్ జెర్సీ కోహ్లీ మాత్రమే ధరించాలి. మరెవరూ ధరించడానికి వీలు లేదు. లిస్ట్ ఏ క్రికెట్ లో అయితే ఎవరికి నచ్చిన జెర్సీ వారు ధరించవచ్చు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఛేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వైభవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూర్యవంశీ (19 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 48), అభిగ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుండు (45 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) దంచికొట్టడంతో.. ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–19తో జరుగుతున్న యూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వన్డేలో ఇండియా అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–19 జట్టు 6 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో ఐదు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా 1–0 లీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలిచింది.

టాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెగ్గి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దిగిన ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 42.2 ఓవర్లలో 174 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. రాకీ ఫ్లింటాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (56) టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. ఇసాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (42) మెరుగ్గా ఆడాడు. డాకిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (18), బెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (16), జేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మింటో (10)తో సహా మిగతా వారు నిరాశపర్చారు. ఇండియా బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధాటికి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆరుగురు సింగిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే పరిమితమయ్యారు. కనిష్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చౌహాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 3, హెనిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అంబ్రిష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇనామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తలా రెండు వికెట్లు తీశారు. తర్వాత ఇండియా 24 ఓవర్లలో 178/4 స్కోరు చేసి నెగ్గింది. స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచే భారీ హిట్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన సూర్యవంశీ, ఆయుష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రే (21) తొలి వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 71 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోడించి శుభారంభాన్నిచ్చారు.