స్వర్ణగిరిలో డిసెంబర్ 29 నుంచి వైకుంఠ ఏకాదశి

స్వర్ణగిరిలో డిసెంబర్ 29 నుంచి వైకుంఠ ఏకాదశి

యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లా స్వర్ణగిరిలోని  వెంకటేశ్వర ఆలయంలో సోమవారం నుంచి వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు జరగనున్నాయి. తొలి రోజున శ్రీదేవి, భూదేవి సమేత శ్రీస్వామి వారు వేకువజామున ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో పాల్గొనే భక్తుల కోసం ఆన్ లైన్ సేవలను అందుబాటులోకి తేనున్నారు. జనవరి 8 వరకు నిర్వహించే ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతి రోజు స్వామి వారికి విశేష అలంకరణ సేవలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.