
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.. వైష్ణవి చైతన్య(Vaishnavi chaitanya) బేబీ( Baby) మూవీతో ప్రేక్షకులను అలరించింది. లేటెస్ట్ గా బేబీ టీమ్ సక్సెస్ సెలెబ్రేషన్స్‌ను జరిపింది. ఈ ఈవెంట్‌కు చిరంజీవి(Chiranjeevi) చీప్ గెస్ట్‌గా వచ్చారు. ఈ సందర్భంగా వైష్ణవి మాట్లాడుతూ.. చిరంజీవి సార్.. మీరు యాక్టింగ్ గాడ్.. మీరు ఎంతో ఇన్సిపిరేషన్.. అంటూ మాట్లాడారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే.. ఈ ఈవెంట్‌లో వైష్ణవి తన ట్రెడిషనల్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది.. తను అచ్చమైన తెలుగు అమ్మాయిలా చీర కట్టుతో.. చక్కని ఆభరణాలతో కనిపించి.. తనలోని మ్యాన్లీ లుక్స్ ని కనబరిచింది. దీంతో కుర్రాళ్ల గుండెల్లో వీణలు మోగుతున్నాయి. బేబీ చీర కడితే చీరకే అందం వచ్చినట్లు కనిపిస్తోందని యూత్ సోషల్ మీడియాలో కామెంట్స్ తెలుసుపుతున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో వైష్ణవి.. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గానే కాకుండా యూత్ కు క్రష్ గా మారింది.
చిరంజీవి బేబీ వైష్ణవి గురుంచి మాట్లాడుతూ.. బేబీ మూవీలో తనను ఎంచుకోవడం ఫస్ట్ సక్సెస్ అని అన్నారు. వైష్ణవి తన ఫస్ట్ ఫిల్మ్ లో ఇంతటి భావోద్వేగాలతో యాక్ట్ చేయడం నన్ను మెస్మరైజ్ చేసిందని.. జయసుధ లాంటి సహజమైన యాక్టింగ్ తో.. పెర్ఫార్మెన్స్ కు నాకు కన్నీళ్లు తెప్పించాయని .. వైష్ణవిని ప్రశంసించారు.
అలాగే ఈ మూవీ క్లైమాక్స్ లో.. హీరోయిన్ వైష్ణవి ప్రేమించిన ఆనంద్‌ను కాకుండా మరొకరిని పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అయిపోతుంది. భర్తతో హ్యాపీగానే ఉన్నప్పటికీ ఆనంద్‌ను చూసినపుడు బాధపడుతుంది. ఆమెకు ఆనంద్ కనపడకుండా ఉంటే బాగుంటుంది కదా అనుకున్నాను. ఎందుకంటే లైఫ్‌లో ఎన్ని తప్పులు చేసినా చివరికి ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవచ్చులే అనే భావం వస్తుందేమో అనిపించింది.
అందుకే ఆమెను నర్స్‌గా, రామకృష్ణ మిషన్‌లో సేవకురాలిగా చూపిస్తే బాగుండేదని సాయి రాజేష్‌కు చెప్పాను. ఆ తర్వాత కూడా అతనికి చాలా గొప్ప సలహా ఇచ్చానని అనుకున్నాను. కానీ అతను చేసిందే కరెక్ట్. ఎందుకంటే జీవితంలో ఒక తప్పు చేసినంత మాత్రాన నిరాశతో బతకాల్సిన అవసరం లేదు. ఆశావాదంతో బతకగలిగితే మళ్లీ చిగురుస్తుందని, కొత్త జీవితాన్ని గడపవచ్చని చూపించారు.
నేటి కాలంలో యువత ఎలా దూసుకుపోతున్నారో సాయి రాజేష్ అద్భుతంగా చూపించారు. బేబీ అనేది ప్రతి యువకుడు చూడాల్సిన ఎడ్యుకేటివ్ ఫిల్మ్ అని నేను భావిస్తున్నాను. సినిమా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని.. చిరంజీవి పేర్కొన్నారు.