వీడియో: రహస్యంగా కలుసుకున్న ప్రేమ జంట.. తల్లి ఎంట్రీతో సీన్ రివర్స్

వీడియో: రహస్యంగా కలుసుకున్న ప్రేమ జంట.. తల్లి ఎంట్రీతో సీన్ రివర్స్

ప్రేమెంత పనిచేసే నారాయణ అనే పాట గుర్తుంది కదా.. అలాంటి ముచ్చటే ఇది. బుధవారం (ఫిబ్రవరి 14) ప్రేమికుల దినోత్సవం కావడంతో ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనే దానిపై ప్రేమపక్షులు ప్రణాళికలు రచిస్తున్నారు. అలాంటి వారందరికీ హెచ్చరికలాంటిది ఈ కథనం. ఓ ప్రేమ జంట రహస్యంగా కలుసుకొని.. వ్యూహాలు రచిస్తుండగా ప్రియురాలి తల్లి ఎంట్రీ ఇచ్చింది. ఇంకేముంది.. కాళ్లలో ఉన్న చెప్పులు తీసి ఇద్దరికీ చెరో నాలుగు వాయించింది.

కూతురు ప్రేమలో పడిన విషయం ఆ తల్లికి ముందే తెలుసు. అడిగితే ఎక్కడ జాగ్రత్త పడుతుంది అనుకుందేమో సమయం కోసం వేచిచూసింది. చివరకు ఆ సమయం రాగా, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని ఎడా పెడా వాయించింది. ప్రేమికుల దినోత్సవం సంధర్బంగా ఓ ప్రేమ జంట  రెస్టారెంట్‌లో సెలబ్రేట్ చేసుకుంటుండగా ప్రియురాలి తల్లి ప్రత్యక్షమయ్యింది. వెంటనే ఇద్దరికి అందరిముందు దెబ్బల రుచి చూపెట్టింది. ప్రియుడిని కొట్టొద్దంటూ కుమార్తె తన తల్లిని వారిస్తుండటం కూడా వీడియోలో చూడవచ్చు. ఆ సమయంలో ఆమె మరింత కోపోద్రిక్తురాలై కూతురిపై గట్టిగా అరుస్తూ దాడి చేస్తోంది.

ఈ సంఘటన గతేడాది జరిగింది అయినప్పటికీ.. రేపు ప్రేమికుల దినోత్సవం కావడంతో ప్రేమజంటలను హెచ్చరిస్తూ మరోసారి వైరల్ చేస్తున్నారు. జర జాగ్రత్తరో సామి.. ఎక్కడ పడితే అక్కడ తిరిగకండి అంటూ నెటిజన్స్ ప్రేమపక్షులకు సలహాలిస్తున్నారు. ఒకవేళ మీరూ.. ఇలాంటి పనులపై బయటకు వెళ్తుంటే కాస్త జాగ్రత్త పడండి. అలా అని తల్లిదండ్రులకు తెలియకుండా తిరగమని మా ఉద్దేశ్యం కాదు.