బీఆర్ఎస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలి : వంశీచంద్ రెడ్డి

బీఆర్ఎస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలి : వంశీచంద్ రెడ్డి

పాలమూరు, వెలుగు: ద్వంద విధానాలతో ఒక్కటిగా పని చేస్తున్న బీఆర్ఎస్, బీజేపీలకు పార్లమెంట్​ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కాంగ్రెస్  ఎంపీ క్యాండిడేట్​ వంశీచందర్ రెడ్డి కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ ఆర్థిక వనరులను దోపిడీ చేసి సంపన్నులకు తాకట్టు పెడుతుఉన్న బీజేపీ సర్కారును గద్దె దించాలన్నారు. 

ప్రతి ఒక్కరూ తమ బూత్, వార్డ్  స్థాయిలో తామే అభ్యర్థిగా భావించి పని చేయాలని సూచించారు. ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్  చైర్మన్  ఓబేదుల్లా కొత్వాల్, బీసీ కార్పొరేషన్  చైర్మన్  శ్రీకాంత్ గౌడ్, మున్సిపల్  చైర్మన్  ఆనంద్ కుమార్ గౌడ్, మిథున్ రెడ్డి, వినోద్ కుమార్, సంజీవ్​ ముదిరాజ్, లింగం నాయక్  పాల్గొన్నారు.

ఢిల్లీ నుంచి గల్లీ వరకు కాంగ్రెస్​దే అధికారం

కొత్తకోట: ఢిల్లీ నుంచి గల్లీ వరకు కాంగ్రెస్  పార్టీ అధికారంలోకి వస్తుందని వంశీచంద్​రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పట్టణంలోని ఓ గార్డెన్ లో జరిగిన కార్యకర్తల సమావేశానికి దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. తనను గెలిపిస్తే జిల్లా ప్రజలందరికీ సేవకుడిగా పని చేస్తానన్నారు. ఎన్నికల్లో కొందరు మతాన్ని అడ్డం పెట్టుకొని ఓట్ల కోసం దేవుడిని పూజిస్తారని, తాము మాత్రం ప్రజలకు సేవ చేస్తూ భక్తి కోసం దేవుడికి పూజలు చేస్తామన్నారు. 

ఎమ్మెల్యే మాట్లాడుతూ మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెబుతున్నారని తెలిపారు. రాజ్యాంగాన్ని రద్దు చేసే పార్టీ కావాలో, రాజ్యాంగాన్ని రక్షించే కాంగ్రెస్  పార్టీ కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు. పల్లెపాగ ప్రశాంత్, మేస్త్రీ శ్రీను, బీచుపల్లి, బాబు, పాపయ్యగారి కృష్ణారెడ్డి, వేముల శ్రీనివాసరెడ్డి, ఎల్లంపల్లి నరేందర్ రెడ్డి, గొల్ల బాబు, చంద్రశేఖర్ రెడ్డి, రాము పాల్గొన్నారు.