వన మహోత్సవాన్ని పండుగలా చేపట్టాలి : టీసీఎస్యూ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి

వన మహోత్సవాన్ని పండుగలా చేపట్టాలి : టీసీఎస్యూ చైర్మన్  మానాల మోహన్ రెడ్డి

బాల్కొండ, వెలుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవాన్ని పండుగలా చేపట్టాలని తెలంగాణ కోఆపరేటీవ్ సొసైటీ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. గురువారం బాల్కొండలో ఆఫీసర్లతో కలిసి మొక్కలు నాటారు. జిల్లా అంతటా పచ్చదనం పరిచేలా మొక్కలు నాటాలని సూచించారు. 

అడవులు నిర్వీర్యం అవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ రసూల్ బీ, ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి,కాంగ్రెస్ ప్రెసిడెంట్లు వెంకటేశ్​గౌడ్, మగ్గిడి ముత్యం రెడ్డి, ఏపీవో ఇందిర తదితరులు పాల్గొన్నారు.