
సిద్ధిపేట : ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో ముఖ్యమంత్రి KCR తో కొత్తగూడెం కాంగ్రెస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు భేటీ అయ్యారు. కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధిపై ఆయన సీఎం KCR తో చర్చించారు. టీఆర్ఎస్ లో చేరేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వనమా వెంకటేశ్వరరావు సీఎంకు చెప్పారు. త్వరలోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరతానని చెప్పారు వనమా.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచారు వనమా వెంకటేశ్వరరావు. 1989, 1999, 2004, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు సార్లు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో వైద్యశాఖలో ఆరోగ్యశ్రీ స్కీమ్ కు సంబంధించి కీలకమైన పదవిలో బాధ్యతలు నిర్వర్తించారు.