ఈమె చేతిలోనే కమల్ హాసన్ ఓటమి

ఈమె చేతిలోనే కమల్ హాసన్ ఓటమి

తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం చీఫ్​ కమల్ హాసన్ ఓడిపోయారు. తమిళనాడులోని కోయంబత్తూర్ సౌత్ నుంచి పోటీ చేసిన ఆయన.. బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ చేతిలో ఓటమి పాలయ్యారు. 1,540 ఓట్ల స్వల్ప మెజార్టీతో కమల్ పై వనతి నెగ్గారు. వనతికి 52,627 ఓట్లు రాగా.. కమల్ కు 51,087 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి మయూర ఎస్ జయకుమార్ కు 41,663 ఓట్లు పడ్డాయి.