యూత్ ఐకాన్: కుర్రాళ్లతో కలకలలాడుతున్న వందే భారత్ రైళ్లు..

యూత్ ఐకాన్:  కుర్రాళ్లతో కలకలలాడుతున్న వందే భారత్ రైళ్లు..

వందే భారత్ ట్రైన్ అంటే యువతలో క్రేజ్ పెరిగిపోతోంది.. వందే భారత్ రైలులో అత్యధికంగా ప్రయాణిస్తున్నది యువతే.. ఇండియన్ రైల్వే చెపుతోంది. దక్షిణ మధ్య రైల్వే జోన్ లోని వందే భారత్ రైళ్లలో ప్రయాణికుల్లో 56 శాతం మంది యువకులు, శ్రామిక వర్గానికి చెందిన ప్రజలేనట.. ప్రయాణం చేసేందుకు అత్యధిక శాతం యువకులు వందే భారత్ రైళ్లను ఇష్టపడుతున్నారు. 

 ఇంతగా వందే భారత్ రైళ్లను ఇష్ట పడటానికి వాటిలో ఏముంది అంటే.. వందే భారత్ రైళ్ల డిజైన్, అందులో ఉన్న సౌకర్యాలు, సర్వీసెస్ .. వీటికి యూత్ ఫిదా అయిపోతోందట.. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. 

ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఐదు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రా బాద్ టు విశాఖ పట్నం, సికింద్రాబాద్ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి సికింద్రాబాద్, కాచిగూడ నుంచి యశ్వంతాపూర్, విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్ కు వందే భారత్ రైళ్లు 100 శాతం ప్రజా ఆదరణతో విజయవంతం నడుస్తున్నాయి. 

ఎస్ సీఆర్ పరిధిలో వందే భారత్ రైళ్లలో 56 శాతం మంది ప్రయాణికులు యువత, శ్రామిక వర్గం ప్రజలే.. దాదాపు ప్రయాణికుల్లో 29 శాతం మంది  29 నుంచి 34 ఏళ్ల లోపు యువకులే.  సగటున 26 శాతం మంది 35 నుంచి 49 ఏళ్ల లోపు వారు వందే భారత్ రైళ్లలో ప్రయాణించేందుకు ఇష్ట పడుతున్నారని తేలింది. 

Also Read:స్కూటీ కొంటానని వచ్చాడు.. టెస్ట్ డ్రైవింగ్ అని

రైలు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా, మెరుగైన సేవల అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే కృషి చేస్తుందనడానికి వందేభారత్ రైళ్లు నిదర్శనం అని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ చెపుతున్నారు.