పీటర్తో రిలేషన్ లో ఉన్నా అంతే అతను నా భర్త కాదు : వనిత విజయ్ కుమార్

 పీటర్తో రిలేషన్ లో ఉన్నా అంతే అతను నా భర్త కాదు : వనిత విజయ్ కుమార్

పీటర్ పాల్ తన భర్త కాదని, ఆయనకు తనకి న్యాయబద్దంగా పెళ్లి జరగలేదని చెప్పుకొచ్చింది నటి వనిత విజయ్ కుమార్ . తామిద్దరం కేవలం కొంతకాలం మాత్రమే రిలేషన్ లో ఉన్నామని తెలిపింది. గత కొంతకాలంగా అనారోగ్యం సమస్యలతో  బాధపడుతున్న పీటర్ పాల్ ఇటీవల మృతి చెందాడు.  దీంతో..  వనిత మూడో భర్త చనిపోయాడంటూ వార్తలు మీడియాలో ప్రచారం అయ్యాయి. తాజాగా  ఆ వార్తలపై వనిత విజయ్ కుమార్ స్పందించింది.  

 పీటర్ పాల్ మృతి చెందిన ఘటనపై స్పందించాలా? వద్దా? అనే విషయంపై తాను చాలా ఓపిక పట్టానని వనిత విజయ్ కుమార్ తెలిపింది.  అయితే ఈ లోపే తనకు  అవకాశం లేకుండా చేశారంది.  అన్ని మీడియా సంస్థలు, న్యూస్‌ ఛానళ్ల మీద ఉన్న గౌరవంతో తాను ఒక విషయం చెబుతున్నానని. పీటర్‌పాల్‌తో తనకు వివాహం జరగలేదని వివరణ ఇచ్చింది. 

2020లో కొన్ని రోజుల పాటు తామిద్దరం రిలేషన్‌షిప్‌లో ఉన్నామని అది ఆ సంవత్సరంతోనే ముగిసిపోయిందని  విజయ్ కుమార్  తెలిపింది  తాను పీటర్  భార్యను కాదని,   అతను తన  భర్త కాదని స్పష్టం చేసింది. వనిత మూడో భర్త చనిపోయాడంటూ వార్తలు రాయడం ఇకనైనా ఆపేయండంటూ కోరింది. ఏ విషయానికి తాను బాధపడటం లేదని, ప్రస్తుతం తన  జీవితాన్ని సంతోషంగా కొనసాగిస్తున్నానని వెల్లడించింది. ప్రస్తుతం వనిత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.