వీఏఓఏటీ జనరల్ సెక్రటరీ అంజయ్యకు ‘సిమా’ అవార్డు

వీఏఓఏటీ జనరల్ సెక్రటరీ అంజయ్యకు ‘సిమా’ అవార్డు
  •     సోషల్ ఫిలాంత్రపిస్ట్ విభాగంలో పురస్కారం

హైదరాబాద్, వెలుగు: సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదలకు ఆపన్న హస్తం అందిస్తున్న అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ (వీఏవోఏటీ) జనరల్ సెక్రటరీ పాపకంటి అంజయ్యకు సోషల్ ఫిలాంత్రపిస్ట్ సిమా 2025 అవార్డు వరించింది. బెంగుళూరు మాల్ ఆఫ్ ఆసియాలో సౌత్ ఇండియా మీడియా అసోసియేషన్ (సిమా) ఆధ్వర్యంలో నిర్వహించిన సిమా అవార్డుల కార్యక్రమంలో అంజయ్య ఈ అవార్డును అందుకున్నారు. 

ఇతరుల సంక్షేమానికి పాటుపడే వ్యక్తిగా ఆయనకు ఈ గౌరవం దక్కింది. తెలుగు సినీ నటులు రాజేంద్రప్రసాద్, అలీ, కర్నాటక రాష్ట్ర ప్రముఖుల చేతులమీదుగా అంజయ్య అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు.