ఒక్కసారి గ్లాసు గుర్తుపై ఓటెయ్యండి... ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టి తీరతా : పవన్ కల్యాణ్

ఒక్కసారి గ్లాసు గుర్తుపై ఓటెయ్యండి... ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టి తీరతా : పవన్ కల్యాణ్

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ప్రారంభమైంది.  ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కత్తిపూడిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ వారాహి వాహనం పై నుంచి ప్రసంగించారు.    తనను అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఎవరు ఆపుతారో చూస్తానని సభా వేదికగా సవాల్ చేశారు.  ఏపీ రాజకీయాలను  గోదావరి జిల్లాలు  శాసిస్తాయని  వపన్ కళ్యాణ్ అన్నారు.  తనకు అవకాశం ఇస్తే అభివృద్ది ఏంటో చూపిస్తానన్నారు.  జనసేన వస్తేనే పోలవరం పూర్తవుతుందన్నారు.  జనసేన చాలా అద్భుతమైన పరిపాలన తీసుకొస్తుందంటూ.. ఒక్కసారి గ్లాసు గుర్తుకు ఓటెయ్యాలని కత్తిపూడి సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.   తాను ముఖ్యమంత్రి పదవిని కోరుకోవడంలేదంటూ జరుగుతున్న ప్రచారాన్ని కత్తిపూడి సభ ద్వారా ఖండించే ప్రయత్నం చేస్తూ.. అవకాశం ఇస్తే తానే ముఖ్యమంత్రి అవుతానని తెలిపారు.  ఎన్నికల్లో పొత్తు గురించి ఇంకా నిర్ణయించుకోలేదని తెలిపారు.     

జనసేన పార్టీని నడిపేందుకే తాను సినిమాల్లో నటిస్తున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు.  మంగళగిరిలో జనసేన కార్యాలయం ఉందన్నారు.   ఇవాళ ( జూన్ 14)  తనకు  ఎంతో ఇష్టమైన చేగువేరా పుట్టినరోజు. యాదృచ్ఛికంగా ఇవాళే వారాహి యాత్ర ప్రారంభమైందన్నారు.  షణ్ముక వ్యూహంతో ఏపీని అభివృద్ది చేస్తానని కత్తిపూడి బహిరంగ సభలో తెలిపారు.

నవంబర్, డిసెంబర్‌లలోనే ఎన్నికలు

కత్తిపూడి బహిరంగ సభలో ముందస్తు ఎన్నికలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలు రావని సీఎం జగన్ కథలు చెప్తున్నాడని.. నవంబర్, డిసెంబర్‌లలోనే ఎన్నికలు జరుగుతాయని పవన్ తెలిపారు. దీనికి సంబంధించి ఎన్నికల కమీషన్‌తోనూ జగన్ మాట్లాడుకుంటున్నారు.. అంతేకాకుండా ప్రిపేర్ అవుతున్నాడని జనసేనాని ఆరోపించారు. తాను బీజేపీతో ఉన్న ముస్లింలపై చేయి పడితే కోరునని చెప్పానని.. ఒక దళితుడుని చంపి ఇంటికి తీసుకుని వెళ్తే వైసీపీ నాయకుడుని ఏమి చేశారని పవన్ ప్రశ్నించారు. అంతే కాకుండా సెక్షన్ 30 పెట్టి మమ్మల్ని ఎవడు ఆపేదన్నారు జనసేనాని. తాము వచ్చిన తర్వాత వైసిపి నాయకులు తాట తీస్తానని హెచ్చరించారు.

అమరావతే రాజధాని

కత్తిపూడి బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం మూడు రాజధానులు అని నాటకాలు ఆడుతున్నాడని.. అమరావతే రాజధానిగా ఉంటుందన్నారు. గాజువాక నుండి తనను గెలిపించి ఉంటే వైజాగ్ దోపిడీ ఆపేవాడినని పవన్ పేర్కొన్నారు. గోదావరి ఈ నేలను విడిచి ఎలా వెళ్లలేదో.. పవన్ కళ్యాణ్ కూడా ఈ నేలను విడిచి వెళ్లలేడని తెలిపారు. మద్యపాన నిషేధం అనేది సాధ్యం కాదని ఎప్పుడో చెప్పానని.. ప్రాంతాలవారీగా చేయొచ్చని పవన్ చెప్పారు. టీటీడీ నుంచి రిజిస్ట్రార్ వరకు ఒకటే కులానికి పట్టం కడుతున్నారని ఎద్దేవా చేశారు