జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా కత్తిపూడి సభా వేదిక వద్ద ప్రమాదం జరిగింది. టాన్స్ ఫార్మర్‌పై పడి జనసైనికుడు మృతి చెందారు. పవన్ కల్యాణ్‌ను చూసేందుకు జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.ఈ క్రమంలో ఓ యువకుడు లైట్ స్టాండ్ ఎక్కాడు. అయితే పట్టు తప్పడంతో ట్రాన్స్ ఫార్మర్‌పై పడ్డారు. వెంటనే విద్యుత్ షాక్ కొట్టి యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు.విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. యువకుడు సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
అయితే పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ప్రారంభమైన తొలి రోజే ఇలా జరగడంతో జనసేన కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది.పవన్ కల్యాణ్‌ను చూసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జనసేన నేతలు సూచించారు. పవన్‌ను కింద నుంచే చూడాలని, గుంతలు, విద్యుత్ స్తంభాలు, ప్రమాద కారకాలను గమనించాలని పేర్కొన్నారు.
