హనుమాన్ సక్సెస్ .. వరలక్ష్మి కోటి డిమాండ్

హనుమాన్ సక్సెస్ ..  వరలక్ష్మి కోటి డిమాండ్

హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి రూటు మార్చిన తార వరలక్ష్మి శరత్ కుమార్. తమిళ, మళయాళీ, కన్నడ, తెలుగు భాషల్లో వరలక్ష్మి నటించింది. పందెం కోడి–2 సినిమాతో వరలక్ష్మి లేడీ విలన్ గా ట్రై చేసి సక్సెస్ అయ్యింది. తరువాత విజయ్ సర్కార్ మూవీలో పవర్ ఫుల్ లేడీ విలన్ గా నటించి మంచి ఇమేజ్ సొంతం చేసుకుంది. తెనాలి రామకృష్ణన్ సినిమాతో టాలీవుడ్ లోకి వరలక్ష్మి శరత్ కుమార్ అడుగుపెట్టింది. 

ఈ సినిమా సక్సెస్ అందుకోలేదు.  గతేడాది సంక్రాంతికి రిలీజ్ అయిన వీరసింహారెడ్డిలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది. ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత ఆమెకి తెలుగులో చాన్సులు పెరిగాయి. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన హనుమాన్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది. 

ఇందులో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రని ఆమె సొంతం చేసుకుంది. ఆమె ఇప్పటి వరకు 50 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. హనుమాన్ సక్సెస్ తో కోటి రూపాయిలు డిమాండ్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది.