దేవుడు, దెయ్యం.. ఓ దొంగ

దేవుడు, దెయ్యం.. ఓ దొంగ

వరలక్ష్మీ శరత్‌‌‌‌‌‌‌‌కుమార్ ఫిమేల్ లీడ్‌‌‌‌‌‌‌‌గా కె హర్ష వర్ధన్ దర్శకత్వంలో రూపొందనున్న యూనిక్  సోషియో ఫాంటసీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్ 'కూర్మ నాయకి'. కె. విజిత రావు నిర్మిస్తున్న ఈ చిత్రం సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత డీవీవీ దానయ్య  క్లాప్ కొట్టారు. లౌక్య సాయి కెమెరా స్విచాన్ చేయగా బెక్కం వేణుగోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. 

హీరో తిరువీర్, శ్రీను గవి రెడ్డి మేకర్స్‌‌‌‌‌‌‌‌కు స్క్రిప్ట్‌‌‌‌‌‌‌‌ను అందజేశారు. ఒక దొంగ, దేవుడు, దెయ్యం నేపథ్యంలో సినిమా ఉంటుందని దర్శకుడు హర్షవర్ధన్ చెప్పాడు.  శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రామ్ డీవోపీగా, చోటా కె ప్రసాద్ ఎడిటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వర్క్ చేస్తున్నారు. స్నిగ్ధ మణికాంత్, పూజిత సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.