పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా... వరలక్ష్మి శరత్ కుమార్

పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా... వరలక్ష్మి శరత్ కుమార్

వరలక్ష్మి శరత్ కుమార్ లీడ్ రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నటిస్తున్న చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’.  సంజీవ్ మేగోటి దర్శకత్వంలో  సింగపూర్ బాలకృష్ణ , మల్లెల ప్రభాకర్ నిర్మిస్తున్నారు. శుక్రవారం సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఇందులో వరలక్ష్మి పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కనిపిస్తుంది. 

ఈ చిత్రంలో  కృష్ణ మీద స్పెషల్ సాంగ్ షూట్ చేసామని, అది సినిమాకే  హైలైట్ అవుతుందని ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు తెలియజేశారు. హారర్ థ్రిల్లర్ బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూపొందుతోన్న ఈ చిత్రంలో  నవీన్ చంద్ర, కృష్ణ సాయి, రాగిణి ద్వివేది, రవిశంకర్, ఆదిత్య ఓం ,అమిత్, దిల్ రమేష్ తదితరులు నటిస్తున్నారు.