వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 25న చేయకపోతే.. ఎప్పుడు చేసుకోవాలి

వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 25న చేయకపోతే.. ఎప్పుడు చేసుకోవాలి

శ్రావణ మాసం అంటే చాలు వరలక్ష్మి వ్రతం గుర్తుకు వస్తుంది.. పెళ్లయిన స్త్రీలు భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారు.  శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం రోజున ( ఆగస్టు 25)  ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం వల్ల సుమంగళీగా ఉండటంతో పాటు భర్త ఆయుష్షు పెరుగుతుందని వరలక్ష్మి దేవి వరాలు ఇస్తుందని నమ్ముతారు.. పూజకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నాము అనుకునే లోపే కొన్ని కొన్ని సార్లు అనుకోని అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి.అలా ఏవైనా అవాంతరాలు  వస్తే ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం..

అమ్మవారికి పూజలను భక్తి శ్రద్దలతో చెయ్యడం వల్ల సుఖ సంతోషాలు వెల్లు విరిస్తాయని పండితులు చెబుతున్నారు.. అందుకే ప్రతి పనిని ఒక నియమం ప్రకారం చెయ్యడం మంచిది.. ఒకవేళ వ్రతం రోజూ అవాంతరాలు  వస్తే ఆ తర్వాత వారం అమ్మవారికి వ్రతం చేసుకోవచ్చునని పెద్దలు చెబుతున్నారు.. శ్రావణ మాసం అయిపోతే దేవి నవరాత్రుల్లో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చునని చెబుతున్నారు.. వరలక్ష్మి అంటే వరాలు ఇచ్చే తల్లీ.. అమ్మను భక్తి తో పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.. అందుకే మహిళలు శ్రావణమాసంలో ప్రత్యేక పూజలు చేస్తారు..

శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం వ్రతం చేసుకుంటారు.. కానీ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారంను వరలక్ష్మి వ్రతం చేసుకోవడం మంచిదని పురాణాల్లో పేర్కొన్నారు.  అయితే ఆరోసు వ్రతం చేసుకోవడానికి ఏదైనా  ఆపద వస్తే ఏమీ బాధ పడాల్సిన అవసరం లేదని చెబుతుంటారు. ఆ తరువాత చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు. దీనికి ఒక పురాణ కథ కూడా ఉందట.  పాండవులు వనవాసం  అయిన తరువాత అజ్ఞాతవాసం సమయంలో ద్రౌపది వ్రతం చేస్తే భర్తల పేర్లు.. గోత్రం చెప్పుకోవాలి.  ఆమె అలా పూజ చేసేటప్పుడు వారిని ఎవరైనా గుర్తిస్తారనే భయంతో వ్రతం చేయలేదట.  అరువాత అన్నగారైన శ్రీకృష్ణుడికి ఈ విషయం చెప్పగా.. ఏమీ చింతించవద్దని చెపుతూ దసరా సమయంలో ఎవరూ నిద్రలేవకముందే ఎవరికీ తెలియకుండా ఈ వ్రతాన్ని చేయమని చెప్పాడు.  అప్పుడు నిన్ను ఎవరూ గుర్తించరని... ఆ తరువాత ఎప్పుడు పూజ చేసే సమయంలో ప్రత్యేకంగావరలక్ష్మీ కథను మనసులో చదువుకొని.. అమ్మవారిని ధ్యానం చేయమని చెప్పాడని  విరాటపర్వంలో ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. 

భర్త ఆరోగ్యం, కుటుంబ సంతోషం కోసం అమ్మవారికి మహిళలు ప్రత్యేక వ్రతాన్ని, నోములను చేసుకుంటారు.. కొందరు మహిళలు ఈ పండుగను చాలా సింపుల్గా జరుపుకుంటే మరికొందరు మాత్రం ఇంట్లో అమ్మవారిని చక్కగా రెడీ చేసి భక్తిశ్రద్ధలతో పూజించి ముత్తైదువులకు వాయనాలు కూడా అందిస్తూ ఉంటారు.. మరి కొంతమంది వచ్చిన ఆడవాళ్లకు రుచికరమైన భోజనాన్ని పెట్టి తాంబూలం ఇస్తారు.. వారికి తాంబులం, పసుపు, కుంకుమ, రవికను, పండును ఇచ్చి ముత్తైదువులతో ఆశీర్వాదాలు తీసుకుంటుంటారు.. ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం లభించడంతో పాటు సుఖ సంతోషాలు వెల్లు విరుస్తాయని పండితులు చెబుతున్నారు.