మహేష్ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న పాన్ వరల్డ్ అడ్వెంచరస్ మూవీ ‘వారణాసి’. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
గ్లోబల్ లెవల్‌లో భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాను దాదాపు 50 భాషల్లో డబ్ చేయాలని రాజమౌళి టీమ్ ప్లాన్ చేస్తున్నారట. సుమారు 120 దేశాల్లో అంతర్జాతీయ స్థాయిలో.. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, బెంగాలీతో పాటు ఫ్రెంచ్, స్పానిష్, జర్మన్, అరబిక్, జపనీస్, కొరియన్ వంటి పలు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.
అక్టోబర్ నాటికి షూటింగ్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసేలా ప్లాన్ చేశారు. సమ్మర్ స్పెషల్‌గా ఇప్పటికే ప్రకటించిన ఏప్రిల్ 7న ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాను వరల్డ్‌వైడ్‌గా విడుదలకు రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
