మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ‘ఇరుముడి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విడుదలైన కేవలం రెండు రోజుల్లోనే రూ.20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను పూర్తి చేసిన ఈ చిత్రం, తొలి వీకెండ్‌లో ప్రపంచవ్యాప్తంగా రూ.71 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇందులో భారత్‌లో రూ.58.37 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి. ముఖ్యంగా ఆదివారం (డే 3) ‘ఇరుముడి’ కలెక్షన్లలో మంచి రెస్పాన్స్ నమోదు చేసింది.
మూడో రోజు ఇండియాలో ఈ సినిమా రూ.18.80 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. శనివారం నాటి రూ.16.20 కోట్ల నెట్‌తో పోలిస్తే ఆదివారం వసూళ్లు సుమారు 16 శాతం పెరిగాయి. దీంతో మూడు రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్స్ రూ.50.30 కోట్లకు చేరుకున్నాయి. మాస్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్, డివోషనల్ అంశాల కలయికతో తెరకెక్కిన ఈ చిత్రానికి రవితేజ ఎనర్జీ, శివ నిర్వాణ దర్శకత్వం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధాన బలాలుగా నిలిచాయని ప్రేక్షకులు చెబుతున్నారు.
3 డేస్ కలెక్షన్స్..
డే 1 (శుక్రవారం): రూ.15.30 కోట్లు నెట్
డే 2 (శనివారం): రూ.16.20 కోట్లు నెట్
డే 3 (ఆదివారం): రూ.18.80 కోట్లు నెట్
3 రోజుల ఇండియా నెట్: రూ.50.30 కోట్లు
3 రోజుల ఇండియా గ్రాస్: రూ.58.37 కోట్లు
3 రోజుల ఓవర్సీస్ గ్రాస్: రూ.13.50 కోట్లు
వరల్డ్‌వైడ్ గ్రాస్: రూ.71.87 కోట్లు
ఆదివారం తెలుగు వెర్షన్ నుంచి రూ.18.76 కోట్లు, తమిళ వెర్షన్ నుంచి రూ.4 లక్షల నెట్ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో భారీ ఆక్యుపెన్సీ..
ఆదివారం ‘ఇరుముడి’ తెలుగు వెర్షన్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. మార్నింగ్ షోలకు 73 శాతం, ఆఫ్టర్‌నూన్ షోలకు 89.69 శాతం, ఈవెనింగ్ షోలకు 91.23 శాతం, నైట్ షోలకు 83.62 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. మొత్తంగా ఆదివారం 85.50 శాతం ఆక్యుపెన్సీ సాధించినట్లు ట్రేడ్ గణాంకాలు చెబుతున్నాయి. ప్రాంతాల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అత్యధికంగా రూ.18.25 కోట్లు గ్రాస్ రాగా, కర్ణాటకలో రూ.2.30 కోట్లు, తమిళనాడులో రూ.53 లక్షలు, కేరళలో రూ.2 లక్షలు, ఇతర ప్రాంతాల్లో రూ.70 లక్షల గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి.
నార్త్ అమెరికాలోనూ రవితేజ సత్తా..
ఓవర్సీస్‌లోనూ ‘ఇరుముడి’ మంచి వసూళ్లను సాధిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ సినిమా వన్ మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు చిత్ర బృందం ప్రకటించింది. నార్త్ అమెరికాలో రవితేజ కెరీర్‌లో మొదటి మిలియన్ డాలర్ మూవీగా ‘ఇరుముడి’ నిలిచిందని మైత్రి మూవీ మేకర్స్ వెల్లడించింది.
SWAMIYE SHARANAM AYYAPPA 🙏🏼#IRUMUDI NORTH AMERICA GROSS - $1 MILLION & COUNTING 🔥❤️🔥
— Prathyangira Cinemas (@PrathyangiraUS) August 23, 2026
Privileged to bring this special film, closer to the hearts of the overseas audience ❤️
Thank you @RaviTeja_offl garu and @MythriOfficial for the opportunity✨
Overseas by @PrathyangiraUS,… pic.twitter.com/21ucrnhpQs
తండ్రీకూతుళ్ల అనుబంధం చుట్టూ కథ:
‘ఇరుముడి’లో రవితేజ త్రీనాథ అనే పాత్రలో కనిపించారు. అయ్యప్ప భక్తుడైన త్రీనాథ గతంలో మద్యపాన వ్యసనం, హింసాత్మక ఘటనలతో ఇబ్బందులు ఎదుర్కొంటుంటాడు. అయితే తన కూతురు మాణిక్యతతో ఉన్న అనుబంధం అతడి జీవితంలో కీలకమైన మార్పును తీసుకొస్తుంది. కథాపరంగా కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, సెకండాఫ్ మాత్రం ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తుందని ఆడియన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మూడు రోజుల్లోనే రూ.71.87 కోట్ల గ్రాస్‌ను అందుకున్న ‘ఇరుముడి’.. రాబోయే రోజుల్లో మరింతగా పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
