దళపతి విజయ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ వారసుడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తమిళంలో వారిసుగా తెరకెక్కుతోంది. కొద్దిసేపటి క్రితమే మేకర్స్ వారిసు తమిళ ట్రైలర్‌ను వదిలారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ ట్రెండింగ్ అవుతోంది. ట్రైలర్ విడుదలైన గంటలోనే 50 లక్షల మంది వీక్షించారు. యూట్యూబ్ లో ఈ ట్రైలర్ దూసుకుపోతుంది. కమర్షియల్ హంగులతో.. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వారిసు ఉండబోతున్నట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
ఈ మూవీలో విజయ్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రకాశ్ రాజ్,ప్రభు,శ్రీకాంత్,యోగిబాబు,శరత్ కుమార్,జయసుధ, ఖుష్బూ సుందర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్,పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు,శిరీష్ సంయుక్తంగా వారసుడు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈమూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న తెలుగు,తమిళ భాషల్లో విడుదల కానుంది. ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.