
మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి( -Lavanya Tripathi) ల నిశ్చితార్థం జూన్ 8న హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన విషయం తెలిసేందే. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం లావణ్య, వరుణ్ తేజ్ ఆగష్టు 24 న పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. మెగా ఫ్యామిలీ నుండి ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ..అందమైన నగరమైన ఇటలీ వీరి పెళ్లి వేడుకకు వేదిక అవునుందని సమాచారం.
రీసెంట్ గా వరుణ్ తేజ్ చేయి పట్టుకుని నడుస్తూ.. చిరునవ్వు చిందిస్తూ లావణ్య విదేశాల్లో విహరించిన..ఫొటోస్ షేర్ చేసిన విషయం తెలిసిందే. ఆ ఫొటోస్ కు కొన్ని క్షణాల్లోనే లక్షల సంఖ్యలో లైక్స్ కూడా వచ్చాయి. కాగా చాలా కాలంగా తమ బంధాన్ని కొనసాగిస్తున్న వరుణ్, లావణ్య తమ సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో ఆగష్టు 24న శుభ ముహూర్తంలో ఈ జంట ఒక్కటవ్వనుందని టాక్ వినిపిస్తోంది. త్వరలో మెగా ఫ్యామిలీ ఆఫీసియల్ గా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వరుణ్ నిశ్చితార్థ వేడుకకు చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్, అల్లు అరవింద్, సాయి ధరమ్ తేజ్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. వరుణ్, లావణ్య గతంలో అంతరిక్షం 9000 KMPH, మిస్టర్ వంటి మూవీస్ లో కలిసి నటించారు.