మహేష్తో అనుకున్నారు.. వరుణ్తో తీశారు.. ఆరేళ్ళ ఫిదా స్పెషల్ స్టోరీ

మహేష్తో అనుకున్నారు.. వరుణ్తో తీశారు.. ఆరేళ్ళ ఫిదా స్పెషల్ స్టోరీ

ఫిదా(Fidaa) సినిమా గురించి తెలుగు సినిమా లవర్స్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Shekhar kammula) దర్శకత్వంలో వచ్చిన ఈ అవుట్ అండ్ అవుట్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు ఆడియన్స్ నిజంగానే ఫిదా అయిపోయారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజ(Dil raju) నిర్మించిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. దీంతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది ఈ సినిమా. చాలా ప్రత్యేకతలు ఉన్న ఫిదా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి నేటి(జులై 21)తో ఆరేళ్ళు పూర్తయింది. కాబట్టి ఫిదా సినిమాపై స్పెషల్ స్టోరీ

ఫిదా కోసం ముందుగా మహేష్ బాబు. 

దర్శకుడు శేఖర్ కమ్ముల ముందుగా ఈ సినిమా కోసం మహేష్ బాబు(Mahesh babu)ను అనుకున్నారట. అదే విషయాన్ని దిల్ రాజు కూడా చెప్పారట శేఖర్ కమ్ముల. ఇక అప్పటికే దిల్ రాజు మహేష్ బాబుతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు(Seetammvaakitllo sirimallechettu) చేసి ఉండటంతో.. ఈజీగా మహేష్ ను ఒప్పించొచ్చు అనుకున్నారట. కానీ ఎందుకో మహేష్ బాబు ఈ సినిమాకు ఓకే చెప్పలేదు. అలా ఈ సినిమాలోకి మెగా హీరో వరుణ్ తేజ్(Varun tej) ఎంట్రీ ఇచ్చారు. తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ అండ్ స్పెషల్ ఫిలింను తన ఖాతాల్లో వేసుకున్నారు. అంతేకాదు ఈ సినిమా తరువాతే వరుణ్ కెరీర్ టర్న్ అయ్యింది. 

తెలంగాణ అమ్మాయిగా మలయాళీ భామ. 

ఫిదా సినిమాకు భానుమతి పాత్ర ప్రాణం. ఆ పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచారు కేరళ బ్యూటీ సాయి పల్లవి(Sai pallavi). ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. సాయి పల్లవికి ఇది మొదటి తెలుగు సినిమా. అంతకు ముందు మలయాళంలో ప్రేమమ్(Premam) అనే ఒక సినిమా మాత్రమే చేశారు. ఫిదా సినిమాతో ప్రేక్షకుల మనసులు దోచేశారు సాయి పల్లవి. ఈ సినిమాతోనే సౌత్ లో సాయి పల్లవి క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. ఈ సినిమాలో ఆమె నటన, డాన్స్ కు కుర్రకారు ఫిదా అయిపోయారు. అంతేకాదు.. తెలంగాణ యాసలో ఆమె చెప్పిన డైలాగ్స్ అయితే ఇప్పటికీ ట్రేడింగే. 

వచ్చిండే పాట ఒక సెన్సేషన్. 

సినిమా పరంగా మాత్రమే కాదు, ఫిదా సినిమాలో పాటలు కూడా భారీ సక్సెస్ అయ్యాయి. ఈ సినిమాలో వచ్చిండే అనే సాంగ్ అయితే.. ఒక సంచలనం అనే చెప్పాలి. పవన్(Pawan CH) అందించిన బాణీకి, సుద్దాల అశోక్ తేజ(Suddala Askhikteja) రాసిన ఈ పాట శ్రోతలను పిచ్చెక్కిపోయేలా చేసింది. మధు ప్రియా(Madhupriya) అద్భుతమైన గాత్రం, సాయి పల్లవి నెమలిలా చెలరేగి చేసిన డాన్స్ పాటను నెక్స్ట్ లెవల్లో నిలబెట్టాయి. ఇక యూట్యూబ్ లో ఈ పాట 100 మిలియన్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటికి చాలా చోట్ల ఈ పాట వినబడటం మన చూస్తూనే ఉంటాం. 

దిల్ రాజుకు ఫిదా సినిమా చాలా స్పెషల్. 

2017లో దిల్ రాజు నిర్మాతగా ఏకంగా ఆరు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో దాదాపు అన్ని సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. అందులో ఫిదా సినిమా ఒకటి. 2017 జులై 21న రిలీజైన ఈ సినిమా.. ఆ ఇయర్ లో దిల్ రాజు నుండి వచ్చిన సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్ రాబట్టి.. దిల్ రాజు కెరీర్ లో స్పెషల్ సినిమాగా నిలిచింది ఫిదా.  

ఫిదా సినిమా సాధించిన అవార్డులు.

ఫిదా సినిమాకు కలెక్షన్స్ మాత్రమే కాదు అదే లెవల్లో అవార్డ్స్ కూడా వరించాయి. ఈ సినిమాకు ఉత్తమనటిగా సాయి పల్లవికి, ఉత్తమ గాయకుడిగా హేమచంద్ర, ఉత్తమ గాయనిగా మధు ప్రియ ఫిలిం ఫేర్ అవార్డ్స్(Filmfare awards) అందుకున్నారు. ఉత్తమ గేయరచయితగా సుద్దాల అశోక్ తేజ, ఉత్తమ గాయనిగా మధు ప్రియ సైమా అవార్డ్స్(Siima) అందుకున్నారు.