తను ఉంటే ఆ సందడే వేరు.. వరుణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

తను ఉంటే ఆ సందడే వేరు.. వరుణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun tej) తన చెల్లెలు నిహారిక(Niharika) గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన రీసెంట్ గా నటించిన మూవీ గాండీవధారి అర్జున(Gandeevadhaari Arjuna). దర్శకుడు ప్రవీణ్ సత్తారు(Pravin sttaru) తెరకెక్కించిన ఈ స్టైలీష్ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన మొదటిరోజు నుంచే  ఆడియన్స్ నుండి  ఈ సినిమాకు మిక్సుడ్ టాక్ వచ్చింది.

ఇదిలా ఉంటే ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు హీరో వరుణ్ తేజ్. ఇందులో భాగంగా తన సినిమా గురించి, ఫ్యామిలీ గురించి, ఇంట్రెస్టిగ్ కామెంట్స్ చేశారు.  అంతేకాదు తన చెల్లి నిహారిక గురించి కూడా ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. నిహారిక ఇంట్లో ఉంటే ఆ సందడే వేరుగా ఉంటుంది. గలగలా మాట్లాతూనే ఉంటుంది. చిన్నప్పుడు మేమిద్దరం బాగా కొట్టుకునేవాళ్లం. ఒకరి మీద, ఒకరు కంప్లైంట్ చేస్కునేవాళ్లం కానీ.. దూరంగా ఉండలంటే మాత్రం చాలా కష్టంగా ఉండేది. నేను యాక్టింగ్ నేర్చుకోవడానికి మొదటిసారి వెళ్లినప్పుడు నీహా నన్ను విడిచి ఉండలేకపోయింది. నా దగ్గరకు వచ్చేస్తానని ఏడ్చేసింది. అలాగే నిహారిక ఇంట్లో లేనప్పుడు నాకు కూడా వెలితిగా ఉంటుంది. ఏ విషయమైనా ఇద్దరం షేర్ చేసుకుంటాం. నీహా కేవలం నాతో మాత్రమే కాదు, ఫ్యామిలీలో అందరితో చాలా ప్రేమగా ఉంటుంది. అందుకే మేమంతా రాఖీ పండగను ఘనంగా జరుపుకుంటాం అని చెప్పుకొచ్చాడు వరుణ్.