వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మట్కా’. కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. 35 రోజుల పాటు ఈ లాంగ్ షెడ్యూల్ జరగనుంది. ఈ ఒక్క షెడ్యూల్ కోసమే దాదాపు పదిహేను కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఒకప్పటి వైజాగ్ లొకేషన్స్‌ను గుర్తుచేసేలా సెట్స్ రీ క్రియేట్ చేశారు.
ఇందుకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేశారు. వింటేజ్ సెట్స్‌లో తీస్తున్న సీన్స్ విజువల్ వండర్‌గా ఉండబోతున్నాయని, సినిమా హైలైట్స్‌లో సెట్‌లు ఒకటిగా నిలుస్తాయని ఈ సందర్భంగా మేకర్స్ తెలిపారు. దేశాన్ని కదిలించిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ డిఫరెంట్ గెటప్‌లో కనిపించనున్నాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్. నోరా ఫతేహి కీలకపాత్ర పోషిస్తోంది. నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
