22వ ఇండో ఫ్రెంచ్వరుణ ద్వైపాక్షిక నావికా విన్యాసాలు ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఫ్రాన్స్‌లోని టౌలాన్‌లో జరిగాయి. మధ్యదరా సముద్రంలో జరిగిన నావికా విన్యాసాల్లో భారత నావికాదళానికి చెందిన ఫ్రంట్‌లైన్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ తబర్ పాల్గొన్నది. భారత నావికాదళం తరఫున హెలికాప్టర్ ఎల్ఆర్ఎంఆర్ ఎయిర్‌క్రాఫ్ట్ పీబీఐ ప్రాతినిధ్యం వహించింది.
అయితే, ఫ్రాన్స్ తరఫున ఎఫ్ఎస్ ప్రోవెన్స్, సబ్‌మెరైన్ సఫ్రెన్, ఎయిర్ క్రాఫ్ట్ ఎఫ్20, అట్లాంటిక్ 2, ఫైటర్స్ ఎంబీ330, హెలికాప్టర్లు ఎన్‌హెచ్90, డౌఫిన్ ప్రాతినిధ్యం వహించాయి. భారత్, ఫ్రాన్స్ మధ్య సంబంధాన్ని బలోపేతం చేయడానికి 2001లో ద్వైపాక్షిక విన్యాసాలు వరుణ ప్రారంభమైంది.