
వాస్తు బ్రహ్మ కాశీనాథుని సుబ్రహ్మణ్యం ఈ తెల్లవారుఝామున శివైక్యం చెందారు. చుక్కాని అనే పత్రికను స్థాపించి పబ్లిషర్, ఎడిటర్ గా జర్నలిజంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. అంతకంటే ముందు కృష్ణాపత్రికకు పబ్లిషర్ గా పనిచేసి.. ఆ పత్రిక ఉన్నత పాత్రికేయ విలువలను కాపడటంలో ఎంతగానో కృషి చేశారు సుబ్రహ్మణ్యం. పాత్రికేయ వృత్తితో పాటు తనకు ఎంతో ఇష్టమైన వాస్తు శాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించారు. వాస్తు శాస్త్రంలో తనదైన పరిజ్ఞానాన్ని సమకూర్చుకుని, దేశ విదేశాలలో ఇంటి వాస్తుతోపాటు సంస్థలకు, పరిశ్రమలకు విలువైన వాస్తు సలహాలు ఇచ్చారు. శైవ మత ప్రచారంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ, శైవ దేవాలయాల నిర్మాణాలకు విరాళాలు ఇచ్చి ధార్మిక రంగంలో కీర్తి గడించారు.