Vastu Tips : పైఅంతస్తులో కాఫీ, టీ కోసం మరో పొయ్యిపెట్టుకోవచ్చా.. మనీ ప్లాంట్మొక్కను ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలి..?

Vastu Tips : పైఅంతస్తులో కాఫీ, టీ కోసం మరో పొయ్యిపెట్టుకోవచ్చా.. మనీ ప్లాంట్మొక్కను ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలి..?

చాలామంది పిల్లల చదువు ఇబ్బంది కలుగకుండా.. ఎలాంటి డిస్టపెన్స్​ లేకుండా ఉండేందుకు పై అంతస్థులో  వారికి రూం కేటాయిస్తారు.  వారు మాటి మాటికి కిందకు రాకుండా .. కాఫీ .. టీ కోసం  అక్కడ ఒక స్టవ్​ ఏర్పాటు చేస్తారు.  వాస్తుప్రకారం అలా ఒకే కుటుంబం కలసి ఒకే చోట ఉండి.. రెండు పొయ్యిలు పెట్టుకోవచ్చా..!   అలా పెట్టుకుంటే ఏమైనా ఇబ్బందులు వస్తాయా.. వాస్తు పండితులు ఏమంటున్నారు.. అలాగే మనీ ప్లాంట్​ మొక్క విషయంలో తీసుకోవలసిన వాస్తు పద్దతుల గురించి తెలుసుకుందాం. .

ప్రశ్న: మొన్నటి వరకూ మేము గ్రౌండ్ ఫ్లోర్​ లో  ఉండి, పైన చిన్న గదిని అద్దెకు ఇచ్చాం. కానీ మా ఇద్దరు అబ్బాయిలు ఇంజనీరింగ్ చేరాక, చదువుకోవడానికి విడిగా గది కావాలన్నారు. దాంతో అద్దెకి ఉండేవాళ్లని ఖాళీ చేయించాం. అప్పటినుంచీ పిల్లలు ఇద్దరూ ఆ గదిని వాడుకుంటున్నాడు. అప్పుడప్పుడు పిల్లలు అందులో టీ, కాఫీలు పెట్టుకోవడానికి ఈ మధ్య ఒక చిన్న స్టవ్​ పెట్టాం. ఒక ఇంట్లో రెండు పొయ్యిలు ఉందొద్దని ఇటీవల ఒకచోట చదివాను. అది నిజమేదా?

సమాధానం: మీరు చదివింది నిజమే. ఒక ఇంట్లో రెండు పొయ్యిలు ఉండకూడదు. అన్నద మ్ములు, తండ్రీ కొడుకులు విడిగా ఉంటూ వేరు కాపురాలు పెడితే. అది వేరే సంగతి. అలా కాకుండా ఒకే సంసారంగా ఉన్న ఇంట్లో మాత్రం వేరుపొయ్యిలు పెట్టుకోవద్దు. టీ, కాఫీల కోసమే అయితే కింది నుంచి ఫ్లాస్క్​లో  పోసుకొని వెళ్ల మనండి. కానీ అలా రెండు చోట అగ్ని ముట్టిస్తే కుటుంబంలో భేదాభిప్రాయా లు, మనశ్శాంతి కోల్పోవడం వంటి దుష్ప్రభావాలు ఎదురవుతాయి.


ప్రశ్న: చాలామంది  వాస్తు, జోతిష్కాన్ని బాగా నమ్ముతాను .  భార్య ఈ మధ్య ఇంట్లో ఒక మనీ ప్లాంట్ మొక్కను తెచ్చిపెట్టింది. అది ఇంట్లో ఉంటే బాగా కలిసొస్తుందని, లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని ఎవరో చెబితే తెచ్చింది.. అది నిజమేనా? ఆలాగే చాలామంది "లాఫింగ్ బుర్ఖాను  కూడా ఇంట్లో పెట్టుకుంటున్నారు. ఇలాంటివి నిజంగానే మంచి ప్రభావం చూపిస్తాయా? ఇప్పుడు మేము ఆ మనీ ప్లాంట్ ఎక్కడ పెడితే మంచిదో చెప్పండి..

సమాధానం: మనీ ప్లాంట్ చాపింగ్ బుద్ఖా వంటివి. పెట్టుకున్నాక... తమకు మంచే జరిగిందని చాలామంది చెబుతున్నారు. కాబట్టి పెట్టుకున్నా తప్పు లేదు. అయితే మనీ ప్లాంట్ ని మట్టి కుండలో పెడితే, దాన్ని ఈశాన్యం మూలలో పెట్టుకోవాలి. అలా కాకుండా ఒక సీసాలో నీళ్లు పోసి, అందులో పడుతుంటారు. అలాంటి వాటిని ఇష్టం ఉన్నదగ్గర పెట్టు కోవచ్చు. లాఫింగ్ బుద్ధాను మాత్రం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర పెట్టాలి..