
చాలా మంది ఇంటి స్థలం తీసుకుంటారు. స్థలం తీసుకునేటప్పుడు వాస్తు ప్రకారం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి... ఈశాన్య వీధిపోటు ఉన్న స్థలం కొనవచ్చా.. స్థలానికి నైరుతిలో చెరువులు.. గుంటలు ఉంటే కష్టాలు కలుగుతాయా.. వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ అందిస్తున్న సలహాలు.. సూచనలను తెలుసుకుందాం...
ప్రశ్న: మా ఇంటికి ఈశాన్య వీధిపోటు ఉంది. ఈశాన్యంలో వీధిపోటు ఉండటం వల్ల చెడు ప్రభావం ఉంటుందా? దీన్ని సరిచేసుకోవచ్చా?
జవాబు:ఈశాన్యం వీధిపోటు ఏవైపు ఉన్నదాన్నిబట్టి నిర్ణయించుకోవాలి. ఉత్తర ఈశాన్యం లేదా తూర్పు ఈశాన్యంలో వీధిపోటు ఉంటే మంచిది.
ప్రశ్న: కొత్తగా కొనాలనుకుంటున్న ప్లాటుకు నైరుతివైపు చిన్న చెరువు గుంట ఉంది. ఆ స్థలం ఇంటి నిర్మాణానికి అనుకూలమా?
జవాబు : చుట్టుపక్కల చెరువులు, గుంటలు ఉన్న స్థలం ఇంటి నిర్మాణానికి పనికివాడు. నైరుతివైపు గుంటలు ఉన్న స్థలం కొనకపోవడమే మంచిది. అలాంటి చోట ఇల్లు కట్టుకోకూడదు.