
పద్మారావునగర్, వెలుగు: శ్రీజనార్ధన ఆనంద సరస్వతి స్వామి సంస్కృతి ట్రస్ట్ రజతోత్సవ వేడుకల సందర్భంగా 25వ తెలంగాణ వేద విద్వాన మహాసభలు బుధవారం స్కందగిరి శ్రీసుబ్రమణ్య స్వామి ఆలయ ఆవరణలో ఘనంగా ప్రారంభమయ్యాయి. స్కందగిరి ఆలయ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ ఎల్వీ సుబ్రహ్మాణ్యం దంపతులు మహాసభలను ప్రారంభించారు. పుష్పగిరి పీఠాధిపతులు విద్యాశంకర భారతీస్వామి వేదాల విశిష్టతను వివరించారు. శ్రీజనార్థన ఆనంద సరస్వతీ స్వామి సంస్కృతి ట్రస్ట్ చైర్మన్ తూములూరి సాయినాథ శర్మ, ప్రధాన కార్యదర్శి బ్రహ్మానంద శర్మ, వేద పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ మహాసభలు ఈ నెల 12 వరకు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు.