ఉద్యోగులకు టీకాలు ప్రారంభించిన వేదాంత

ఉద్యోగులకు టీకాలు ప్రారంభించిన వేదాంత

ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది వేదాంత. వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను దేశ వ్యాప్తంగా ఒకేసారి చేపట్టింది. ఐరన్ అండ్ స్టీల్స్ బిజినెస్ రంగంలో ఉన్న తమ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతోపాటు వ్యాపార భాగస్వాములకు టీకాలను అందించాలని నిర్ణయించింది. తొలుత 50వేలు, ఇప్పుడు అదనంగా మరో 2 లక్షల టీకా మోతాదులను సమీకరించుకోవడంతో తమ ఉద్యోగులకు కుటుంబ సమేతంగా వ్యాక్సినేషన్ ప్రారంభించింది.

దేశవ్యాప్తంగా 1.2 లక్షల మందికి టీకాలను వేయనున్నట్లు వేదాంత ఛైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ చెప్పారు. ఇదే సమయంలో తమ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు అత్యుత్తమ శ్రేణి టర్మ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని సైతం సంస్థ అందిస్తుందన్నారు. ఈ పాలసీ ద్వారా ఐదు సంవత్సరాల వార్షిక జీతానికి ఐదు రెట్ల కవరేజీని ఉద్యోగులకు అందిస్తామని, దీనితో పాటుగా మెడికల్‌ భీమా కవరేజీని సైతం 1.5 రెట్లు వృద్ధి చేశామన్నారు. అంతేకాకుండా దేశ వ్యాప్తంగా 10 వేదాంత కేర్స్‌ ఫీల్డ్‌ ఆస్పత్రులను కోవిడ్‌ రోగుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చి సేవలను అందిస్తున్నామని వివరించారు.