వీ బోర్డులోకి  బిర్లా రీఎంట్రీ.. 7% పెరిగిన షేరు

 వీ బోర్డులోకి  బిర్లా రీఎంట్రీ.. 7% పెరిగిన షేరు

న్యూఢిల్లీ : వొడాఫోన్ ఐడియా (వీ) బోర్డులోకి రెండేళ్ల గ్యాప్ తర్వాత  ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా రీఎంట్రీ ఇవ్వడంతో వీ షేర్లు శుక్రవారం ర్యాలీ చేశాయి. అప్పుల భారంతో దివాలా అంచులకు జారిపోయిన ఈ టెలికం కంపెనీలో నాన్ ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నాన్ ఇండిపెండెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అదనపు డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మంగళం బిర్లా బాధ్యతలు తీసుకున్నారు. వీ షేరు శుక్రవారం 7 శాతం పెరిగి రూ.6.48 వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో ఈ కంపెనీ షేర్లు 10 శాతం ఎగిసి రూ.6.65 వరకు వెళ్లింది. ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈలో వీ షేరు 6.61 శాతం పెరిగి రూ.6.45 వద్ద సెటిలయ్యింది.

బీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈలో సుమారు 7.39 కోట్ల కంపెనీ షేర్లు శుక్రవారం చేతులు మారాయి. ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈలో అయితే ఏకంగా 32.62 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి.  కుమార్ మంగళం బిర్లా 2021, ఆగస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వీ బోర్డు నుంచి తప్పుకున్నారు. అప్పటి వరకు కంపెనీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్న ఆయన, తన పదవికి రాజీనామా చేశారు. ‘  కుమార్ మంగళం బిర్లాను అదనపు డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నియమించేందుకు కంపెనీ బోర్డు డైరెక్టర్లు అంగీకరించారు. ఈ నిర్ణయం బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది’ అని వీ ఎక్స్చేంజి ఫైలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది.