వీరసింహారెడ్డి 100 డేస్​ సెలబ్రేషన్స్​ – థియేటర్స్​​ లిస్ట్ పెట్టాలంటూ ఛాలెంజ్!

వీరసింహారెడ్డి 100 డేస్​ సెలబ్రేషన్స్​ – థియేటర్స్​​ లిస్ట్ పెట్టాలంటూ ఛాలెంజ్!

100 రోజులు బొమ్మ పడిందంటే సందడే సందడి.  ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన వీరనరసింహారెడ్డి సినిమా ధియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకోబోతుంది.  దీంతో నటసింహ నందమూరి బాలకృష్ణ  ఖాతాలో మరో 100 రోజుల సినిమా చేరబోతోంది. చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ 100 రోజుల వేడుకలను నిర్వహించబోతోంది. ఈ మేరకు 100 డేస్ సెలబ్రేషన్స్ గ్రాండ్ ఈవెంట్‌ను ఈనెల 23న నిర్వహించనున్నట్టు మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఈవెంట్ డేట్ అనౌన్స్‌మెంట్‌తో బాలకృష్ణ పవర్‌ఫుల్ పోస్టర్ కూడా పోస్ట్ చేసింది. ఈవెంట్ ఎక్కడ నిర్వహిస్తారు అనే విషయాన్ని నిర్మాతలు త్వరలోనే వెల్లడించనున్నారు.

‘వీరసింహారెడ్డి’ 100 రోజులు పూర్తిచేసుకోవడంతో నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈవెంట్ అదిరిపోవాలని అంటున్నారు. ఈ ఈవెంట్‌ను హిందూపురంలోని ఎంజీఎం గ్రౌండ్స్‌లో జరపనున్నారని కొంతమంది అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అయితే, ఇతర హీరోల అభిమానులు మాత్రం ‘వీరసింహారెడ్డి’ 100 రోజులు ఫేక్ అని కొట్టిపారేస్తున్నారు. దమ్ముంటే థియేటర్స్ లిస్ట్ ప్రకటించి వేడుకలు జరుపుకోవాలని ఛాలెంజ్ చేస్తున్నారు. ఫేక్ రికార్డులకు కూడా ఒక లిమిట్ ఉంటుందని, ఫ్లాప్ సినిమాను కూడా బ్లాక్ బస్టర్ అంటే మైత్రీ మూవీ మేకర్స్ రెప్యుటేషన్ తగ్గడం మొదలైనట్టేనని ఒక యూజర్ కామెంట్ చేశారు. మొత్తం మీద మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటనపై విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.