ములకలపల్లి, వెలుగు : మండలంలోని మూకమామిడిలో ఉన్న సంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో శుక్రవారం నూతనంగా వీర్ల అంకమ్మ తల్లి, పోతురాజు, సింహ వాహన ఆలయ శిఖర ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా నిర్వహించారు.
మూడు రోజులుగా ఆలయంలో ప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకొని యజ్ఞ హోమాలు నిర్వహించారు. నూతన ఆలయంలో పీఠాధిపతులు పల్నాటి వీరాచారి, పిడుగు తరుణ్ చెన్నకేశవ స్వహస్తాలతో వీర్ల అంకమ్మ తల్లికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఈ కార్యక్రమానికి వేద పండితులు బ్రహ్మశ్రీ కొదమ సింహం భరద్వాజ్ ఆధ్వర్యంలో నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై తీర్థప్రసాదాలు అందుకున్నారు.
