హైదరాబాద్, వెలుగు: పీసీసీ ఓబీసీ సెల్ రాష్ట్ర చైర్మన్‌గా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశం మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం ఈ నియామకాలు చేశారు. దీనికి సంబంధించిన ప్రకటనను మీడియాకు విడుదల చేశారు. ఓబీసీ సెల్ కన్వీనర్లుగా కేతూరి వెంకటేశ్, జూలూరి ధనలక్ష్మిని నియమించారు.
కాగా.. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఎప్పటికప్పుడు గాంధీ భవన్ కేంద్రంగా చర్చించేందుకు పీసీసీ వార్ రూమ్ చైర్మన్ గా గుత్తా అమిత్ రెడ్డిని నియమించారు. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఈ నియామకాన్ని ప్రకటించారు. ఈ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని మహేశ్ గౌడ్ పేర్కొన్నారు.
