కూరగాయల వ్యాపారికి కరోనా.. మార్కెట్ మూసివేత‌

V6 Velugu Posted on Jun 16, 2020

రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా యాదాద్రి-భువనాగిరి జిల్లాలోని చౌటుప్పల్ మున్సిపాలిటి కేంద్రంలో ఓ కూరగాయల వ్యాపారికి క‌రోనా సోకిన‌ట్టు నిర్ధార‌ణ అయింది. దీంతో మున్సిపాలిటీ ఛైర్మ‌న్ రెడ్డి రాజు.. మార్కెట్ యజమానులకు థర్మల్ టెస్ట్ చేసి.. మార్కెట్ మూసివేయించారు. అత‌నితో కాంటాక్ట్ అయిన వ్య‌క్తులకు అధికారులు పరీక్షలు నిర్వహించే పనిలో పడ్డారు. కూరగాయల వ్యాపారికి కరోనా రావడంతో స్థానికంగా అలజడి రేగింది.

 

 

Tagged Covid-19, corona, tests positive, Choutuppal, vegetable vendor

Latest Videos

Subscribe Now

More News