వెహికల్స్ అమ్మకాలు తగ్గినయ్​

వెహికల్స్ అమ్మకాలు తగ్గినయ్​

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న ఆటోమొబైల్​ ఫ్యాక్టరీల నుంచి డీలర్‌‌‌‌షిప్‌‌లకు వెహికల్​ డిస్పాచ్​లు ఫిబ్రవరిలో 23 శాతం తగ్గాయి. దాదాపు అన్ని సెగ్మెంట్లలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.  సెమీకండక్టర్ కొరతతో సహా సప్లై సమస్యలు, కొత్త రూల్స్​ అమలు,  వెహికల్స్​ ధరల పెరుగుదల వంటివి ఇందుకు కారణమని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్)​ శుక్రవారం తెలిపింది.  కార్లు, టూవీలర్​, త్రీవీలర్​అమ్మకాలు ఫిబ్రవరి 2021లో 17,35,909 యూనిట్లతో పోలిస్తే గత నెలలో 23 శాతం తగ్గి 13,28,027 యూనిట్లకు పడిపోయాయి.  2022 ఫిబ్రవరి లో కార్ల డిస్పాచ్​లు ఆరు శాతం తగ్గి 2,62,984 యూనిట్లకు చేరాయి.  కార్ల హోల్‌‌సేల్స్  ఫిబ్రవరి 2021లో 1,55,128 యూనిట్లతో పోలిస్తే   గత నెలలో 1,33,572 యూనిట్లకు పడిపోయాయి. అయితే, యుటిలిటీ వెహికల్ డిస్పాచ్‌‌లు గత ఏడాది ఇదే కాలంలో 1,14,350 యూనిట్ల నుంచి 1,20,122 యూనిట్లకు పెరిగాయి. వ్యాన్ల అమ్మకాలు ఫిబ్రవరి 2021లో 11,902 యూనిట్లతో పోలిస్తే గత నెలలో 9,290 యూనిట్లకు తగ్గాయి. టూవీలర్​ హోల్‌‌సేల్స్ 27 శాతం తగ్గాయి. అమ్మకాలు 14,26,865 యూనిట్ల నుంచి 10,37,994 యూనిట్లకు పడిపోయాయి.  ఫిబ్రవరిలో స్కూటర్ హోల్‌‌సేల్స్ 3,44,137 యూనిట్లకు పడిపోయాయి.