శ్రీశైలంలో అణువణువూ తనిఖీలు.. ఒక్క వాహనాన్నీ వదలకుండా చెక్ చేస్తున్నారు..!

శ్రీశైలంలో అణువణువూ తనిఖీలు.. ఒక్క వాహనాన్నీ వదలకుండా చెక్ చేస్తున్నారు..!

ఇండియా-పాకిస్థాన్ మధ్య యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో శ్రీశైలంలో దేవస్థానం అధికారులు భద్రతా చర్యలు ముమ్మరం చేశారు. శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు ఆదేశాలతో ఆలయ సిఎస్ఓ ఆధ్వర్యంలో సెక్యూరిటీ సిబ్బంది శ్రీశైలం క్షేత్రానికి వచ్చే ప్రతి వాహనాలను తనిఖీలు నిర్వహిస్తున్నారు. దేవస్థానం పరిధిలోకి ప్రవేశించే దేవస్థానం టోల్గేట్ వద్ద ప్రతి ఒక్క వాహనాలను నిలిపి వాహనం లోపల క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే శ్రీశైల క్షేత్రంలోనికి అనుమతిస్తున్నారు...