పాసులు మిస్ యూజ్ చేస్తే వాహ‌నాలు సీజ్

పాసులు మిస్ యూజ్ చేస్తే వాహ‌నాలు సీజ్

హైదరాబాద్: న‌గ‌రంలో మే 7 వరకు లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తామ‌ని, హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ అన్నారు. అత్యవసర స‌మ‌యాల్లో ప్ర‌యాణాలు చేసే వారి కోసం తెలంగాణ ప్ర‌భుత్వం.. ఈ పాస్ ద్వారా పాసులు ఇస్తున్నద‌ని, వీటి అవ‌స‌రం ఉన్నవారు ఆన్ లైన్ లో అప్లికేషన్ చేసుకోవాలని చెప్పారు. అత్యవసరం కోసం తీసుకున్న పాసులను దుర్వినియోగం చేస్తే వెహికిల్స్ ను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామ‌ని ఆయ‌న‌ చెప్పారు.

ప్రతి రోజు 700 వందల నుంచి 800 వెహికల్స్ సీజ్ చేస్తున్నామ‌ని, రేపటి నుంచి స్పెషల్ డ్రైవ్ లో వెహికిల్స్ చెకింగ్ ను పటిష్టం చేస్తామ‌ని సీపీ చెప్పారు. స్విగ్గి,జోమాటో వెహికిల్స్ రోడ్లపై కనిపిస్తే వెహికిల్స్ సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామ‌న్నారు. లాక్ డౌన్ లో 49863 కేసులు నమోదయ్యాయ‌ని, 69288 వెహికిల్స్ సీజ్ చేశామని చెప్పారు. సిటీ లో 395 పాజిటివ్ కేసులు నమోదయ్యాయ‌ని, 331 కేసులు ఆక్టివ్ ఉన్నాయ‌న్నారు. సిటీలో 124 కంటైన్మెంట్ జోన్ లు, 113 చెక్ పోస్ట్ లు ఉన్నాయని న‌గ‌ర పోలీసులు 24 గంటలు పని చేస్తున్నార‌న్నారు. ప్ర‌జ‌లంతా తమ‌కు స‌హ‌క‌రించాల‌ని, అందరూ లాక్ డౌన్ రూల్స్ ను పాటించాలని అంజనీ కుమార్ కోరారు.