
వెహికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (వీఆర్డీఈ డీఆర్డీఓ) పెయిడ్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 25.
పోస్టుల సంఖ్య : 15 (పెయిడ్ అప్రెంటీస్)
ఎలిజిబిలిటీ : గుర్తింపు పొందిన యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేషన్ ఏడో లేదా ఎనిమిదో సెమిస్టర్ చదువుతున్న వారు లేదా మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ మొదటి లేదా రెండో సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు అర్హులు.
ALSO READ : ITI వారికి గుడ్ న్యూస్: హైదరాబాద్ BHELలో ఉద్యోగాలు
వయోపరిమితి : గరిష్ట వయోపరిమితి 28 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్లు ప్రారంభం : జులై 16.
లాస్ట్ డేట్ : జులై 25.
సెలెక్షన్ ప్రాసెస్ : ఇంటర్వ్యూ ద్వారా.
స్టైఫండ్ : ప్రతి నెలా రూ.5000 చొప్పున ఆరు నెలలపాటు చెల్లిస్తారు.
పూర్తి వివరాలకు drdo.gov.in వెబ్ సైట్లో సంప్రదించగలరు.