అంతర్జాతీయ అవార్డుకు.. వెలుగు’ కార్టూనిస్టు ఎంపిక

అంతర్జాతీయ అవార్డుకు.. వెలుగు’ కార్టూనిస్టు ఎంపిక

హైదరాబాద్, వెలుగు: అంతర్జాతీయ అవార్డుకు ‘వెలుగు’ కార్టూనిస్టు జక్కుల వెంకటేష్ ఎంపికయ్యారు. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ‘ఓస్టెన్’ నిర్వహించిన 55వ వరల్డ్ గ్యాలరీ ఆఫ్ కార్టూన్స్‌‌‌‌‌‌‌‌ అవార్డుకు వెంకటేష్ వేసిన చార్లీ చాప్లిన్ కార్టూన్ క్యారికేచర్ ఎంపికైంది. నార్త్ మాసిడోనియాలోని స్కోప్‌‌‌‌‌‌‌‌జేలో నవంబర్ 22, 23 తేదీల్లో నిర్వహించే వేడుకలో అవార్డుల ప్రదానోత్సవం, ఎగ్జిబిషన్ జరగనుంది. ఈ ఎగ్జిబిషన్‌‌‌‌‌‌‌‌కు మొత్తం 130 కార్టూన్లు ఎంపిక అయ్యాయి. 

ఈ పోటీలో భారత దేశం నుంచి ఇద్దరు ఎంపిక కాగా.. అందులో వెంకటేష్ ఒకరు. 55 ఏండ్ల ప్రపంచ కార్టూన్ల గ్యాలరీ (1969 – 2023) జూబ్లీ రెట్రోస్పెక్టివ్ ఎగ్జిబిషన్, 55వ వరల్డ్ గ్యాలరీ ఆఫ్ కార్టూన్ల స్కోప్‌‌‌‌‌‌‌‌జే 2023 అధికారిక ఎగ్జిబిషన్, అవార్డుల ప్రదానోత్సవానికి రావాలంటూ జక్కుల వెంకటేష్‌‌‌‌‌‌‌‌ను ‘ఓస్టెన్’ సంస్థ ఆహ్వానించింది. ‘‘మీకు హృద యపూర్వక ఆహ్వానాన్ని అందజేయడానికి సంతోషిస్తున్నాం. మీ ప్రత్యేక దృక్పథాన్ని, కళాత్మక ప్రయాణాన్ని తోటి కార్టూనిస్టులతో పంచుకోవడానికి మీరు ఈ ఈవెంట్‌‌‌‌‌‌‌‌కు హాజరు కావడాన్ని గౌరవంగా భావిస్తున్నాం” అని పేర్కొంది...