- ముప్కాల్ మండలం వేంపల్లిలో తీర్మానం
బాల్కొండ, వెలుగు: ‘పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మా గ్రామంలోకి ఐస్క్రీమ్ బండ్లకు ప్రవేశం లేదు’ అంటూ నిజామాబాద్జిల్లా ముప్కాల్ మండలం వేంపల్లి గ్రామ పంచాయతీ నిర్ణయం తీసుకుంది.
ఐస్క్రీమ్ ఆటోలు, బండ్లకు ప్రవేశం లేదని.. నిబంధనలు అతిక్రమించి అమ్మితే రూ.5 వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. కాగా ఈ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పిల్లల ఆరోగ్య పరిరక్షణ కోసం తీసుకున్న నిర్ణయాన్ని పలువురు అభినందిస్తున్నారు.
