
23న రాజన్న కల్యాణం
వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఇవాల్టి నుండి ఐదు రోజుల పాటు ఉత్సవా లు జరుగనున్నాయి. ఈ ఉత్సవా లను ఘనంగా నిర్వహించేం దుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. తొలిరోజు ప్రత్యేక పూజలతో ఉత్సవా లు మొదలవుతాయి. 23న శ్రీ పార్వతి శ్రీ రాజరాజేశ్వర స్వామి కల్యాణం జరుగుతుంది. అంతకుముందు ఎదుర్కోళ్ల ఉత్సవాన్ని నిర్వహిస్తారు. 25న రథ ప్రతిష్ట, శ్రీ స్వామివారి రథోత్సవం, వసంతోత్సవం తదితర కార్యక్రమాలు జరుగుతాయి. 26న చివరి రోజు పూర్ణహుతి, ఏకాంత సేవతో ఉత్సవాలు ముగుస్తాయి. ఐదు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు భక్తులు ఎక్కువగా వస్తారని, వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేశామని ఈవో దూస రాజేశ్వర్ తెలిపారు.