రాజన్న సన్నిధిలో వైభవంగా శ్రీనివాసుని కళ్యాణం

రాజన్న సన్నిధిలో వైభవంగా శ్రీనివాసుని కళ్యాణం

వేములవాడ రాజన్న సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ..శ్రీనివాసుని దివ్య కళ్యాణం వైభవంగా జరిగింది. గుడి చెరువులో అందంగా అలంకరించిన వేదికపై శ్రీనివాసుని కళ్యాణాన్ని..గిరిధర్ స్వామి అర్చక బృందం జరిపించింది. కల్యాణాన్ని తిలకించడానికి.. స్థానిక భక్తులతోపాటు పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీనివాసుడి కల్యాణంలో టీటీడీ అధికారులు, ఈవో దూస రాజేశ్వర్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.