
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివార్ల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణం తిలకించేందుకు రాష్ట్రం నలుమూల నుండి భక్తులు తరలివచ్చారు. ఉదయం స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకదాశ రుద్రాభిషేకంతో ….కళ్యాణ ఘట్టం ప్రారంభించారు అర్చకులు. వరుడు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని, వధువు పార్వతి దేవిని వేదమంత్రాలు, మేళతాళాల మధ్య ఘనంగా ఎదుర్కొన్నారు. అభిజిత్ లగ్న ముహూర్తంలో కళ్యాణ మహోత్సవం జరిగింది.