అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం తప్పింది. బస్సు హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తోంది. మంగళవారం తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట్ ఫ్లైఓవర్ పైకి చేరుకోగానే ఓవర్ హీట్ కారణంగా బస్సు టైర్లలో నుంచి పొగలు వచ్చాయి. దీంతో డ్రైవర్ పక్కకు ఆపాడు. మరో బస్సు అరేంజ్ చేస్తామని చెప్పడంతో 26 మంది ప్రయాణికులు తీవ్ర చలిలో రోడ్డు పైనే వేచివున్నారు. గంటల తరబడి చలిలో ఇబ్బంది పడినా వేమూరి ట్రావెల్స్ యాజమాన్యం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
