మదురో దంపతులపై క్రిమినల్ చార్జెస్ ..న్యూయార్క్ కోర్టులో క్రిమినల్ అభియోగాలు

మదురో దంపతులపై క్రిమినల్ చార్జెస్ ..న్యూయార్క్ కోర్టులో క్రిమినల్ అభియోగాలు

ఫ్లోరిడా:వెనెజువెలా ప్రెసిడెంట్ మదురో, ఆయన భార్య సీలియా ఫ్లోరెస్ పై న్యూయార్క్ కోర్టులో క్రిమినల్ అభియోగాలు మోపనున్నట్టు యూఎస్ అటార్నీ జనరల్ పామ్ బోండీ వెల్లడించారు. ‘‘అమెరికన్ గడ్డపై, అమెరికన్ కోర్టుల్లో వాళ్లిద్దరూ త్వరలోనే విచారణను ఎదుర్కొంటారు” అని ఆమె శనివారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. 

మదురోపై న్యూయార్క్ సదర్న్ డిస్ట్రిక్ట్ లో నార్కో టెర్రరిజం, కొకైన్ ఇంపోర్టేషన్ కుట్రలకు పాల్పడటం, అమెరికాకు వ్యతిరేకంగా మెషీన్ గన్ లు, విధ్వంసకర పరికరాలు సమకూర్చుకోవడం వంటి అభియోగాలు ఉన్నాయని తెలిపారు.